News February 5, 2025

రాష్ట్రస్థాయి డాన్స్ పోటీల్లో విజేతగా కోటపల్లి వాసి

image

మందమర్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డాన్స్ పోటీల్లో కోటపల్లి మండలంలోని బబ్బెరచెలుక గ్రామానికి చెందిన చేకూర్తి సూర్య ప్రతిభ కనబరిచాడు. తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుని బెస్ట్ డాన్సర్‌గా రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ప్రముఖ డ్యాన్సర్లు మల్లేష్, టోనీ కిక్ అవార్డు ప్రదానం చేశారు. సూర్యను గ్రామస్తులు అభినందించారు.

Similar News

News November 22, 2025

UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

image

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%

News November 22, 2025

సూర్యాపేట: ‘ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను వేగవంతం చేయాలి’

image

5-15 సంవత్సరాల పాఠశాల విద్యార్థులందరికీ ఆధార్ మెండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ సీతారామ రావు ఆపరేటర్లకు సూచించారు. జిల్లాలో 24,532 మంది విద్యార్థులకు ఈ అప్‌డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆధార్ సవరణలు (పేరు, పుట్టిన తేదీ) కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 22, 2025

మంచిర్యాల: పసిబిడ్డల ప్రాణాలకు లెక్కలేదా?

image

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరు డాక్టర్లు <<18353100>>బిడ్డల<<>> ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంతో వారి ప్రాణాలు తీసి డబ్బులతో పరిహారం చేసుకుంటున్నారు. శుక్రవారం డాక్టర్ల నిర్లక్ష్యానికి 5 ప్రాణాలు పోయాయి. అయినా వారిలో సీరియస్‌నెస్ లేదు. ఇన్ని ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టనట్లు వ్యవరిస్తున్నారని.. బిడ్డల ప్రాణాలు తీసి డబ్బులు బిచ్చంగా పడేసి తప్పించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్