News February 5, 2025

రాష్ట్రస్థాయి డాన్స్ పోటీల్లో విజేతగా కోటపల్లి వాసి

image

మందమర్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డాన్స్ పోటీల్లో కోటపల్లి మండలంలోని బబ్బెరచెలుక గ్రామానికి చెందిన చేకూర్తి సూర్య ప్రతిభ కనబరిచాడు. తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుని బెస్ట్ డాన్సర్‌గా రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ప్రముఖ డ్యాన్సర్లు మల్లేష్, టోనీ కిక్ అవార్డు ప్రదానం చేశారు. సూర్యను గ్రామస్తులు అభినందించారు.

Similar News

News February 12, 2026

T20 WC: భారత్ భారీ స్కోర్

image

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.

News February 12, 2026

‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

image

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.

News February 12, 2026

KNR: ‘నగర’ ఫలితం: లెక్కింపునకు సర్వం సిద్ధం

image

కరీంనగర్ నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో సీపీ గౌస్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. 300 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేయగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ ఓట్లను లెక్కిస్తారు.