News March 19, 2025
రాష్ట్రస్థాయి పైలట్ ప్రాజెక్టులో కొలనూర్ గ్రామం

ఓదెల మండలంలోని కొలనూర్ గ్రామానికి రైతు గుర్తింపు కార్డుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనట్టు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఇస్తుందని తెలిపారు అందులో భాగంగా రేపు కొలనూరు రైతువేదికలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు ఆధార్ కార్డు, భూమిపట్టా పాస్‌బుక్ తీసుకొని రావాలని సూచించారు. భూమి ఉన్న ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు
Similar News
News November 28, 2025
శంషాబాద్: విమానంలో ప్రయాణికురాలితో అసభ్య ప్రవర్తన

విమానంలో మహిళ ప్రయాణికురాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పోలీసుల వివరాలు.. బుధవారం జైపూర్ నుంచి ఇండిగో విమానం శంషాబాద్‌కు వస్తుండగా.. పక్క సీట్లో కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని ఓ వ్యక్తి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఎయిర్ లైన్స్ అధికారులు ఆర్జీఐఏ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
News November 28, 2025
ADB: ఇక్కడ 11.. అక్కడ 38 ఏళ్లుగా NO ELECTIONS

స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎంతో హడావిడిగా ఉంటుంది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అలర్ట్‌గా ఉంటారు. కానీ ఒక గ్రామ పంచాయతీకి 11 ఏళ్లుగా, మరో పంచాయతీకి 38 ఏళ్లుగా సర్పంచ్ లేరు. ఉట్నూర్‌ను 2019 నుంచి మున్సిపాలిటీ చేస్తామని ఎన్నికలు నిర్వహించలేదు. దండేపల్లి మండలం గూడెం(1987) పంచాయతీగా ఏర్పడినా నోటిఫైఢ్ ఏరియాలో ఉండటంతో ST రిజర్వేషన్ కల్పించారు. గ్రామంలో ST లేకపోవడంతో ఎన్నికలు జరగలేదు.
News November 28, 2025
HYD: నూతన అధ్యాయానికి జలమండలి గ్రీన్ సిగ్నల్..!

HYDలో నీటి సరఫరా వ్యవస్థలో నష్టాలను తగ్గిస్తూ, నీటి నాణ్యతను మెరుగుపరచేందుకు నూతన టెక్నాలజీకి HMWSSB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరి వినియోగదారుని వరకు రియల్‌టైమ్ పర్యవేక్షణ కోసం రా వాటర్ పంపింగ్ స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, రిజర్వాయర్లను పరిశీలించే వ్యవస్థను ప్రస్తుత స్కాడాతో అనుసంధానం చేసే సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేయాలని ఆదేశించారు.


