News January 22, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు కడప జిల్లా కబడ్డీ జట్లు ఎంపిక

image

51వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కడప జిల్లా సీనియర్ విభాగం బాలబాలికల జట్లను బుధవారం ఎంపిక చేశారు. కడప నగరంలోని శివ శివాని హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఈ ఎంపికలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, జనార్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు వైజాగ్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు.

Similar News

News February 10, 2025

బీటెక్ రవిని ప్రశ్నించిన విచారణాధికారి

image

తనని కడప జైల్‌లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్‌లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం

News February 10, 2025

కడప: దస్తగిరికి నోటీసులు

image

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై ప్రత్యేక పీపీ, దస్తగిరికి హైకోర్టు నోటీసులు పంపింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది..

News February 10, 2025

సమస్యలు ఉంటే అర్జీలతో రండి: కడప కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కడప కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఆహారాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నారు.

error: Content is protected !!