News March 22, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు ఖమ్మం బిడ్డ సిరి

వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2025 రాష్ట్రస్థాయి పోటీలకు జేవియర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దాసరి సిరి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డా.ఎన్.గోపి తెలిపారు. కళాశాలతో పాటు మండల, జిల్లా స్థాయుల్లో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థులు దాసరి సిరికి అభినందనలు తెలిపారు.
Similar News
News March 23, 2025
ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.
News March 23, 2025
ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ. 185 ఉండగా, స్కిన్ లెస్ కేజీ రూ.210 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 130 మధ్య ఉంది. కాగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
News March 23, 2025
ఖమ్మం: బావిలో పడి మహిళా కూలీ మృతి

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నాగులవంచ గ్రామానికి చెందిన కూరపాటి రాంబాయి (54) అనే మహిళ శనివారం ఉదయం కూలీ పనికి వెళ్లగా తాగునీరు కోసం బావి దగ్గరికి వెళ్లి మంచినీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల మీరా కేసు నమోదు చేశారు.