News September 11, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు వల్లూరు విద్యార్థినులు

వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ కం జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా పులివెందులలో మంగళవారం నిర్వహించిన బాలికల విభాగం ఖోఖో పోటీల్లో కళాశాలకు చెందిన ఇంటర్ సెకండీయర్ ఎంపీసీ విద్యార్థిని మమత, ఇంటర్ సెకండీయర్ బైపీసీ విద్యార్థిని ముబీన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Similar News
News December 9, 2025
కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.
News December 9, 2025
కడప జిల్లా SP కీలక సూచన.!

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.
News December 9, 2025
వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా: లింగారెడ్డి

వైసీపీ హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో టీటీడీ నెయ్యి సరఫరాలో నిబంధనలు సడలించారన్నారు. వేల కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనికిలో లేని కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. టీటీడీ పవిత్రత, భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారన్నారు.


