News August 29, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు 32 మంది విశాఖ క్రీడాకారులు

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 32 మంది ఎంపికయ్యారు. ఈనెల 31నుంచి తిరుపతిలో జరగ నున్న పోటీలకు వీరంతా జిల్లా నుంచి పాల్గొంటారని తైక్వాండో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. అదేవిధంగా ఉమెన్స్ లీగ్ పోటీలు కూడా అదే తేదీల్లో తిరుపతిలో జరగనున్నాయన్నారు. ఈనెల 27న గాజువాకలో జిల్లాస్థాయి కాడెట్ క్యొరుగి, పూమేసే పోటీల్లో పలువురు పతకాలు సాధించారన్నారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ఐఫోన్ కొనివ్వలేదని బాలుడి సూసైడ్

ఐఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రుల మీద అలిగి బాలుడు(17) ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం.. ఆరో తరగతి వరకు చదువుకున్న బాలుడు చదువు మానేసి ఇంట్లోనే ఉండేవాడు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. ఐఫోన్ కావాలని తండ్రితో గొడవ పడి ఇంటికి రావడం మానేశాడు. కాగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
News November 25, 2025
ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.


