News December 29, 2024
రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమ్మడి ADBజట్టు

హన్మకొండలో జరుగుతున్న రాష్ట్రస్థాయి CMకప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికలజట్టు ఫైనల్స్ లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జట్టుతో తలపడి 12గోల్స్ ఆధిక్యంలో జిల్లా జట్టు విజయం సాధించింది. జిల్లా క్రీడాకారులు,కోచ్ అరవింద్ ను ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు,కనపర్తి రమేష్,పలువురు అభినందించారు.
Similar News
News September 19, 2025
ADB: కలెక్టర్ సార్.. మీ కోసమే ఎదురుచూపులు

”స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లయినా మా గ్రామానికి రోడ్డు లేక నరకయతన పడుతున్నాం. విద్య, వైద్యం పొందలేక అవస్థలు పడుతున్నాం. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్ వెళ్లలేని పరిస్థితి. నిత్యవసరాలకీ నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేక పిల్లలు చదువులకు దూరమయ్యారు” అంటూ గుబిడి గ్రామస్థులు కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం చర్చనీయంగా మారింది. మండల పర్యటనకు రానున్న కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
News September 19, 2025
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.