News February 2, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో జన్నారం విద్యార్థిని ప్రతిభ

జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.అరవిందరాణి రాష్ట్రస్థాయి ఆంగ్ల ఉపన్యాస పోటీల్లో సత్తా చాటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన ఉపన్యాస పోటీలు ఆమె తృతీయ బహుమతి సాధించారని HM రాజన్న తెలిపారు. దీంతో విద్యార్థిని అరవింద రాణిని, గైడ్ టీచర్, ఉపాధ్యాయుడు కమలాకర్ను ఆయన అభినందించారు.
Similar News
News November 4, 2025
కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్షా సమావేశం

PDPL జిల్లా వైద్యధికారి డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది. ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరగ్రస్తుల రక్త నమూనాలు సేకరించి, మలేరియా, డెంగ్యూ రాపిడ్ టెస్టులు చేయాలని ఆమె సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్లు నమూనాలను T హబ్ సెంటర్కు పంపించాలని, పరికరాలు సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
News November 4, 2025
చరిత్ర తెలియకుండా సీఎం మాట్లాడుతున్నారు: నిరంజన్ రెడ్డి

ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్)కి 1994లోనే కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 2014 వరకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు టన్నెల్ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2004లో జలయజ్ఞంలో భాగంగా పనులు ప్రారంభించినప్పటికీ, చరిత్ర తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని ఆయన విమర్శించారు.
News November 4, 2025
గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలని కలెక్టర్కు ఛైర్మన్ వినతి

భద్రాద్రి జిల్లా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని గ్రంథాలయ ఛైర్మన్ వీరబాబు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ను కోరారు. జిల్లా గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు, పలు గ్రంథాలయాల అభివృద్ధికి స్థల సేకరణ అవసరం ఉందన్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు సహాయం చేయాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.


