News February 19, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన సిద్దిపేట క్రీడాకారులు

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, ఎనిమిది బ్రోంజ్ మెడల్ పథకాలు సాధించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు నారన్నగారి రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వామి ఉన్నారు.
Similar News
News October 22, 2025
మిరప సాగు – విత్తన మోతాదు, విత్తన శుద్ధి

వర్షాధారంగా మిరపను సాగు చేస్తారు. ఈ పంటకు నల్ల, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. మిరపకు మెత్తని దుక్కికావాలి. అందుకే నేలను 3-4 సార్లు దున్ని 2సార్లు గుంటక తోలాలి. విత్తనం ఎద బెట్టేందుకు ఎకరానికి 2.5KGల విత్తనం అవసరం. రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను, తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధిచేయాలి.
News October 22, 2025
పెంచలకోన వాటర్ఫాల్స్కు రాకండి: ఎస్ఐ

భారీ వర్షాల నేపథ్యంలో రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేశ్ కీలక ప్రకటన చేశారు. పెంచలకోన ఆలయ సమీపంలో ఉన్న వాటర్ఫాల్స్కు వర్షపు నీరు భారీగా వస్తోందని చెప్పారు. ప్రజలు ఎవరూ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లరాదని కోరారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటర్ ఫాల్స్ వద్దకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.
News October 22, 2025
సిరిసిల్ల: జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలు: MLA

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుని మద్దతు ధర పొందాలని వేములవాడ MLA ఆది శ్రీనివాస్ కోరారు. కొనరావుపేట మండలం కనగర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిరిసిల్ల అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.