News May 27, 2024
రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో అనంతపురం జిల్లాకు తృతీయ స్థానం

అనంతపురం జిల్లా బాస్కెట్ బాల్ బాలురు, బాలికల జట్లు విజయవాడలో ఈనెల 21 నుంచి 24 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్ బాల్ పోటీలలో తృతీయ స్థానం సాధించారు. ఈ పోటీలలో బాలురు విభాగంలో అనంతపురం జట్టు.. విశాఖపట్నం జట్టుతో, బాలికల విభాగంలో అనంతపురం జట్టు.. పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో కలిసి సంయుక్తంగా తృతీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. అనంతపురం జిల్లా జట్టు సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News October 26, 2025
నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచండి: ఎస్పీ

నేరస్తులు, రౌడీ షీటర్లపై ఉక్కు పాదం మోపినట్లు ఎస్పీ జగదీష్ ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. చోరీలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మట్కా, గుట్కా, చైనీ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను తరలించినా, ప్రోత్సహించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 26, 2025
JNTUలో 28, 29, 30న ఇంటర్వ్యూలు

అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 28, 29, 30న కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీంకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది బోధన సిబ్బంది పాల్గొననున్నారు. 28 మంది సీనియర్ ప్రొఫెసర్‌కు, 6 మంది ప్రొఫెసర్‌కు, 11 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతులకు దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు.
News October 26, 2025
అనంతపురంలో రేపు పీజీఆర్ఎస్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 27న రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు స్లిప్పులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


