News September 17, 2024
రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు మూడో స్థానం

ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.
Similar News
News December 27, 2025
21,033 మంది శక్తి యాప్ డౌన్లోడ్: ఎస్పీ

కర్నూలు జిల్లాలోని విద్యాసంస్థల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై శక్తి టీమ్లు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, డయల్ 112, 1930 వంటి సేవల వినియోగంపై విద్యార్థినులకు వివరించామన్నారు. జనవరి నుంచి డిసెంబర్ 27 వరకు జిల్లాలో 21,033 మంది శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
News December 27, 2025
డిసెంబర్ 29న పీజీఆర్ఎస్: కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 29న (సోమవారం) ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, మున్సిపల్, డివిజన్ కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ అర్జీల పరిష్కార స్థితిని కాల్ సెంటర్ నంబర్ 1100 లేదా Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆమె సూచించారు.
News December 27, 2025
కర్నూలు జిల్లాలో 17,089 ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 17,089 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.


