News September 22, 2024

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కాపుశంభం విద్యార్థినిలు

image

సెప్టెంబర్ చివరి వారంలో జరగనున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు జెడ్పీ హెచ్ స్కూల్ కాపుశంభం విద్యార్థినిలు ఆర్.అనూష, ఈ.జెనీలియా, పి భవాని ఎంపికైనట్లు స్కూల్ హెచ్.ఎం రాము శనివారం తెలియజేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొండవెలగాడలో జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో ప్రతిభను చూపి విజయం సాధించారన్నారు. పోటీలకు ఎంపికైన వారిని అభినందించారు.

Similar News

News November 13, 2025

విజయనగరం జిల్లా పత్తి రైతులకు గమనిక

image

జిల్లా పత్తి రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పంటను విక్రయించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం విజ్ఞప్తి చేశారు. దళారీలను, మధ్యవర్తులను నమ్మవద్దని రైతులను హెచ్చరించారు. రైతులు పత్తిని ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.8,110 కంటే తక్కువకు విక్రయించవద్దని సూచించారు. ఇప్పటికే పత్తి సాగు ఉన్న 140 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

News November 12, 2025

VZM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజీ కాదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను గుర్తించి లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని సూచించారు. వారెంట్ పెండింగ్, గంజాయి, పోక్సో కేసుల ముద్దాయిలకు అవగాహన కల్పించి నేరాలను తగ్గించాలని పేర్కొన్నారు.

News November 12, 2025

అధికారులకు విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో పలు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన, మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు భూములు త్వరగా ఇవ్వాలని సూచించారు. అందరికీ ఇళ్లు పథకం దరఖాస్తులను వేగంగా పరిశీలించాలన్నారు.