News October 1, 2024

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఇరగవరం విద్యార్థి

image

ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గూనా గౌరిదానేశ్వరి రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైంది. మంగళవారం భీమవరంలో పీఎస్‌ఎం బాలికల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో స్వర్ణాంధ్ర 2047 జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.

Similar News

News December 5, 2025

ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

image

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్‌కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.