News November 6, 2024

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కుకునూరుపల్లి విద్యార్థి 

image

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కుకునూరుపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఎండి అబ్దుల్ రహమాన్ ఎంపికయ్యారు. హుస్నాబాద్‌లో జరిగిన ఎస్జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్ బాల్ అండర్-14 విభాగంలో జిల్లాస్థాయిలో సత్తా చాటి, రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ బచ్చల సత్తయ్య, పీడీ రాజ్ కుమార్ విద్యార్థి అబ్దుల్ రెహ్మాన్‌ను అభినందించారు.

Similar News

News November 5, 2025

కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

image

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.

News November 5, 2025

కరాటే పోటీలకు మెదక్ విద్యార్థుల ఎంపిక

image

69వ రాష్ట్రస్థాయి SGF ఆధ్వర్యంలో జరగనున్న పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు కరాటే విద్యార్థులు ఎంపికైనట్లు సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ తెలిపారు. అండర్-14 విభాగంలో విశిష్ట రాజ్, సాయిచరణ్, కనిష్కచారి, అర్మన్, అండర్-17లో అఖిల్, అండర్-19లో నిత్య సిరి, ఐశ్వర్య, అబ్దుల్లా ఎంపికయ్యారు. విద్యార్థులను SGF మెదక్ జిల్లా సెక్రెటరీ నాగరాజు, హవేలిఘనపూర్ ఎంఈఓ మధుమోహన్ అభినందించారు.

News November 5, 2025

మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

image

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్‌మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.