News March 26, 2024
రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మార్చేశారు: బత్యాల

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా కిల్లీ కొట్టులో కూడా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం విక్రయించే నాసిరకం మద్యం తాగడంతో పలువురు పేదలు కూడా మరణించారని విమర్శించారు.
Similar News
News October 14, 2025
ఎర్రగుంట్ల: రేపటి నుంచి నిరవధిక సమ్మె

ఎర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీపీపీ మెయిన్ గేట్ వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 2022లో నిలిచిపోయిన బకాయిలు వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో యాజమాన్యంతో నిన్న జరిగిన చర్చలు విఫలమవడంతో రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.
News October 14, 2025
16న గండిక్షేత్రంలో వేలం

చక్రాయపేట మండలం గండిక్షేత్రం శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 16వ తేదీ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ ఆవరణలో టెంకాయల విక్రయాలు, వివాహాలు జరిపించడం, ఇతర కార్యక్రమాలకు డెకరేషన్ సప్లయర్స్కు సంబంధించి వేలం జరుగుతుంది. ఈ-టెండర్లు, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం నిర్వహిస్తారు.
News October 14, 2025
ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి: కడప SP

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. అదనపు SP (అడ్మిన్) ప్రకాశ్ బాబు ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం చేయాలని పోలీసులు ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 158 పిటీషన్లను చట్టం ప్రకారం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ పాల్గొన్న కార్యక్రమంలో ఫిర్యాదుదారులకు సిబ్బంది సహాయం చేశారు.