News April 2, 2025
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంచిర్యాల బిడ్డ చంద్రమోహన్

తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన ఊదారీ చంద్రమోహన్ గౌడ్ ఎన్నికయ్యారు. మంగళవారం HYDలో జరిగిన ఎన్నికల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించగా 20/20 ఓట్ల మెజార్టీతో చంద్రమోహన్ గెలుపొందారు. సెక్రటరీగా సుకుమార్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి బాస్కెట్ బాల్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు
Similar News
News December 7, 2025
భారీ జీతంతో రైట్స్‌లో ఉద్యోగాలు..

<
News December 7, 2025
జనగామ: గుర్తులు ఖరారు!

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. వార్డు మెంబర్, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో పోటీదారులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
News December 7, 2025
కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.


