News October 4, 2024

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా రవినాయుడు బాధ్యతలు

image

ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా అనిమిని రవి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని తెలిపారు. తనతోపాటు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్నతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 7, 2024

కృష్ణా: ‘కొరత సృష్టించే వారిపై చర్యలు తప్పవు’

image

జిల్లాలో నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకే నిత్యావసర సరుకులను ప్రజలకు విక్రయించాలన్నారు. ధరల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదన్నారు.

News November 7, 2024

ఘంటసాల: ఈ స్వామి భక్తుల పాపాలు హరిస్తాడు 

image

ఘంటసాల మండలం శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర ఆలయం ప్రసిద్ధమైంది. శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభూగా వెలిసి, భక్తుల పాపాలను హరిస్తాడని భక్తుల నమ్మకం. క్రీ.పూ. 4వ శతాబ్దంలోనే ఇక్కడ స్వామి ఆలయం ఉందని, ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాలలో 57వ దిగా పిలవబడుతోంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖంలో బ్రహ్మోత్సవాలు, కార్తీకంలో పూజలు చేస్తారు. సిరికొలనుగా పిలిచే ఈ ప్రాంతం కాలక్రమేణా శ్రీకాకుళంగా రూపాంతరం చెందింది. 

News November 7, 2024

కృష్ణా: ఈ ఆలయం నరకాసురుడి సంహారానికి ప్రతీక

image

చల్లపల్లి మండలం కృష్ణానది తీరానా నడకుదురులోని పృథ్వీశ్వర ఆలయం ప్రసిద్ధమైంది. ఇక్కడే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసుడిని సంహరించాడని ఇతిహాసం. అందుకే ఈ ప్రాంతం నరకొత్తూరు నుంచి నడకుదురుగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలో పాటలీ వృక్షం ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రతి దీపావళికి నరకసురుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. కార్తీక మాసంలో భక్తులు ఇక్కడి నదిలో స్నానమాచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు.