News February 10, 2025
రాష్ట్ర గంగపుత్ర సదస్సులో నిర్మల్ జిల్లా విద్యార్థులు

హైదరాబాద్‌లో జరుగుతున్న రాష్ట్ర గంగపుత్ర విద్యార్థుల సదస్సులో ఆదివారం రెండో రోజు నిర్మల్ జిల్లా గంగపుత్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యావంతులు పరిష్కరించే విధంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలైన గ్రూప్ 1,2,3 వంటి పోటీ పరీక్షలతో పాటు స్వయం ఉపాధి, కుల వృత్తుల వంటి వాటిలో యువతను ప్రోత్సహించే విధంగా మెలుకువలను అందించారు.
Similar News
News March 15, 2026
బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
News March 15, 2026
తమిళనాడు ఎన్నికలు.. ఫ్రంట్ రన్నర్‌గా DMK?

<<19389988>>TN ఎన్నికల్లో<<>> AIADMK నేతృత్వంలోని NDA, DMK, TVK పార్టీల మధ్య పోరు నెలకొంది. 234 స్థానాల్లో 2021లో 159సీట్లతో అధికారంలోకి వచ్చిన DMKకు వెల్ఫేర్ స్కీమ్‌లు, ద్రవిడియన్ మోడల్ గవర్నెన్స్ బలం. ఇక పళనిస్వామి AIADMKను నడిపిస్తున్నా జయలలిత లేని లోటును పూడ్చుకునే పనిలోనే ఉన్నట్లు విశ్లేషకుల మాట. అటు TVK యూత్, మైనార్టీ ఓట్లను చీల్చే ఛాన్స్ ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా DMKకు కలిసొస్తుందని అంటున్నారు.
News March 15, 2026
MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.


