News March 18, 2025
రాష్ట్ర గవర్నర్ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
Similar News
News December 4, 2025
పూజల్లో అరటి పండు ప్రాధాన్యత

పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఇతర పండ్లలాగా దీనికి ఎంగిలి ఉండదు. అదెలా అంటారా? దాదాపు అన్ని చెట్లు వాటి గింజల నుంచి మొలుస్తాయి. ఆ గింజలను మనం ఎంగిలిగా భావిస్తాం. కానీ, అరటి అలా కాదు. ఇది మొక్కల ద్వారానే వృద్ధి చెందుతుంది. అందుకే దీన్ని పూర్ణఫలంగా, పవిత్రమైనదిగా దేవుడికి నివేదిస్తారు. పండ్లను, ఆకులను.. ఇలా ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని పూజకు వాడుతారు.
News December 4, 2025
స్కూళ్లలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన 1,146 అకడమిక్ ఇన్స్ట్రక్చర్లను భర్తీ చేయనున్నారు. వీటిలో 892 సబ్జెక్ట్ టీచర్లు, 254 SGT పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. 7వ తేదీ లోపు ఎంపిక చేపడుతారు. అభ్యర్థులు డిసెంబర్ 8 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్కు నెలకు రూ.12,500, SGTలకు రూ.10వేలు చెల్లిస్తారు.
News December 4, 2025
కృష్ణా జిల్లా అమర గాయకుడు జయంతి నేడు

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా సంగీతాభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. అనేక భాషల్లో ఆయన ఆలపించిన గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. “చివరి శ్వాస వరకు గానం చేస్తాను” అన్న ఆయన మాటలు సంగీతాభిమానులను ముద్దుపెట్టుకుంటూనే ఉన్నాయి.


