News February 19, 2026

రాష్ట్ర పండుగగా రాజాం పైడితల్లి అమ్మవారి జాతర

image

AP: విజయనగరం(D) రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవాలకు రూ.50లక్షల నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

Similar News

News March 17, 2026

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో DA హైక్?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DAను మార్చి చివరి లేదా ఏప్రిల్ తొలి వారంలో పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 58% DAను 60% లేదా 61%కి పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. AICPI డేటా ప్రకారం కనీసం 2% పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి అందే అవకాశం ఉంది. దీనివల్ల ‘బేసిక్ పే’ను బట్టి నెలకు రూ.వేలల్లో జీతం పెరగనుంది.

News March 17, 2026

మహిళా యాక్టర్లు పబ్లిక్ ప్రాపర్టీలు కాదు: ఖుష్బూ

image

అనవసర చర్చల్లోకి మహిళా యాక్టర్లను లాగుతున్నారని BJP నేత, నటి ఖుష్బూ సుందర్ ఫైరయ్యారు. ‘ఇతరులను విమర్శించేందుకు ఓ మహిళ ఐడెంటిటీని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి మగాడు జన్మించేది స్త్రీకే. మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడతారా? మహిళా యాక్టర్లు పబ్లిక్ ఫిగర్లు కావచ్చేమో కానీ పబ్లిక్ ప్రాపర్టీలు కాదు’ అని అన్నారు. <<19407702>>నయనతారపై MP వ్యాఖ్యలు<<>>, విజయ్-త్రిష వ్యవహారంపై ఆమె ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

News March 17, 2026

ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లను వాడుకోవాలని కేంద్రం సూచన

image

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. LPGకి బదులు వీలున్నవాళ్లు ఇండక్షన్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లను వాడుకోవాలని తెలిపింది. ఇలా ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్‌లను వాడమని సూచించడం ఇదే తొలిసారి. అలాగే PNGకి మారే అవకాశాన్నీ పరిశీలించాలని కోరింది. ఇలా వీలైన చోట గ్యాస్‌ను పొదుపు చేయడం కోసం ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలంది. ఎట్టిపరిస్థితుల్లో పానిక్ బుకింగ్ చేయొద్దని కోరింది.