News February 1, 2025
రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్లో సంగారెడ్డి జిల్లాకు సిల్వర్ మెడల్

కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్లో సంగారెడ్డి జిల్లా ఐటీ కోర్ టీం గంగేరి సంతోష్ కుమార్ త్వైకాండో సిల్వర్ మెడల్ సాధించారు. కరీంనగర్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ వరకు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సిల్వర్ మెడల్ సాధించిన సంతోష్‌ను అధికారులు ప్రశంసా పత్రం, సిల్వర్ మెడల్ అందజేసి అభినందించారు.
Similar News
News December 16, 2025
ఏప్రిల్ నుంచి పెన్షన్ల పెంపు?

TG: వచ్చే ఏడాది APR నుంచి పెన్షన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధ్యాప్య, వితంతు తదితర పెన్షనర్లు 44లక్షల మంది ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో వారికోసం ₹11,635Cr కేటాయించింది. పెంపు జరిగితే ₹22K Cr కావాల్సి ఉండగా నిధుల సమీకరణ మార్గాలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. ఒకేసారి పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగా అమలు చేయనుంది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ ₹2,016 ఇస్తుండగా హామీ మేరకు ₹4వేలు చేయాల్సి ఉంది.
News December 16, 2025
ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి విడత నిర్వహణను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని ఆర్ఓలు, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీఓ, ఇతర అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత విడతల్లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకూడదని ఆదేశించారు.
News December 16, 2025
ASF: 4 మండలాల్లో 938 పోలింగ్ బూత్‌లు

ఆసిఫాబాద్ జిల్లాలో చివరి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాలలో 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు 938 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


