News February 1, 2025
రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లాకు సిల్వర్ మెడల్

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో సంగారెడ్డి జిల్లా ఐటీ కోర్ టీం గంగేరి సంతోష్ కుమార్ త్వైకాండో సిల్వర్ మెడల్ సాధించారు. కరీంనగర్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ వరకు నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన సంతోష్‌ను అధికారులు ప్రశంసా పత్రం, సిల్వర్ మెడల్ అందజేసి అభినందించారు.
Similar News
News February 18, 2025
సంగారెడ్డి: ప్రజావాణికి 43 దరఖాస్తు: కలెక్టర్

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 43 మంది తమ సమస్యలను విన్నవించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 15 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
News February 18, 2025
చొప్పదండి: విండోను సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ బృందం

చొప్పదండి సింగిల్ విండోను సోమవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు, అధికారుల బృందం సందర్శించింది. సొసైటీ పనితీరు, రైతులకు అందించే సేవలను పాలకవర్గం వారికి వివరించింది. సొసైటీ సభ్యులకు 10 శాతం డివిడెండ్ అందిస్తున్నామని, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని తెలిపారు. వ్యవసాయ రుణాల రికవరీ 100 శాతం చేశామని, ఇతరు రుణాలు 85 శాతం వరకు రికవరీ చేశామని చెప్పారు.
News February 18, 2025
అభా కార్డుల నమోదు పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్

అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని బాపట్ల కలెక్టర్ కలెక్టర్ వెంకట మురళి సోమవారం చెప్పారు. ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 85% సర్వే పూర్తి అయ్యిందన్నారు. వేటపాలెం, కర్లపాలెం, యద్దనపూడి మండలాలలో ఈ ప్రక్రియ జాప్యంపై అరా తీశారు. సత్వరమే నూరు శాతానికి ఈ ప్రక్రియ చేరుకునేలా మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంఈవోలు, వైద్య అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.