News September 22, 2024
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం: పల్లా

గత ప్రభుత్వంలో దగా పడిన ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక నియోజకవర్గం 69, 70, 71 వ వార్డుల్లో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు.
Similar News
News January 11, 2026
రేపు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) జరగనుంది. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్, ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగర ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కి తెలియజేసి, సత్వర పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.
News January 11, 2026
విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం

విశాఖలో ఓ మహిళపై జరిగిన దాడిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని సీఎం కొనియాడారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదన్నారు.
News January 11, 2026
జీవీఎంసీ బడ్జెట్ రెడీ… రేపు స్థాయి సంఘంలో చర్చ!

జీవీఎంసీ బడ్జెట్ తుదిమెరుగులు దిద్దారు. కమిషనర్ కేతన్గర్, మేయర్ శ్రీనివాసరావు కలిసి బడ్జెట్ రూపకల్పన చేయగా 13 పద్దుల కింద రూ.2064.73 కోట్లు ఆదాయం అని అంచనా వేశారు. జీవీఎంసీకి సొంతంగా అన్ని విభాగాల నుంచి 1749.68 కోట్లు సమకూర్తున్నట్లు బడ్జెట్‌లో చూపించారు. బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాలను సోమవారం జరిగే స్థాయి స్థానం సమావేశంలో సభ్యులతో సలహాలు తీసుకొని తుది మార్పులు చేసి ఆమోదం తెలపనున్నారు.


