News February 8, 2025
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది: మంత్రి సీతక్క
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020590076_20316190-normal-WIFI.webp)
ములుగు మండలం ఇంచర్లలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రూ.2లక్షల రుణమాఫీ చేసిందని మంత్రి సీతక్క అన్నారు.
Similar News
News February 9, 2025
బంగ్లాదేశ్‌లో హిందువులపై 2 నెలల్లో 76 దాడులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739045532877_893-normal-WIFI.webp)
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 26, 2024 నుంచి జనవరి 25, 2025 వరకు బంగ్లాలో హిందువులపై మొత్తం 76 దాడులు జరిగాయని పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 23 మంది హిందువులు చనిపోయారని, 152 దేవాలయాలపైనా దాడులు జరిగినట్లు పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
News February 9, 2025
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739029022924_50226745-normal-WIFI.webp)
ఎల్లారెడ్డి పట్టణ శివారులోని మీసాన్ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి బిక్కనూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఏగొండ(18) అనే యువకుడు తన వాహనాన్ని అతివేగంగా నడిపి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News February 9, 2025
ములుగు: గుప్పుమంటున్న గుడుంబా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739031465375_1047-normal-WIFI.webp)
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.