News October 29, 2024
రాష్ట్ర బ్యాడ్మింటన్ విజేతలుగా కృష్ణా జిల్లా బాలికలు
కృష్ణా జిల్లా బ్యాడ్మింటన్ బాలికలు 68వ అంతర్ జిల్లాల అండర్ 14, 17 విభాగంలో ప్రథమ స్థానం సాధించిన్నట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, సీజర్ రెడ్డిలు మంగళవారం తెలిపారు. వీరికి శిక్షణను ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన కోచ్, మేనేజర్లు ముకుంద, నరసింహారావు, గణేశ్ లను అభినందించారు.
Similar News
News November 8, 2024
దేవాదాయ శాఖలో త్వరలో 500 పోస్టుల భర్తీ
దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 500 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న అర్చక విభాగం, పరిపాలనా పరమైన విభాగంలో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News November 8, 2024
కృష్ణా: కొత్త ఓటు నమోదుకు స్పెషల్ క్యాంప్‌లు
జిల్లాలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఈ నెల 9,10,23,24 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో కోరారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ తప్పనిసరిగా తమ ఓటును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు.
News November 8, 2024
కృష్ణా: ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం 1.3లక్షల బుకింగ్‌లు
ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 1.3లక్షల మంది బుకింగ్ చేసుకున్నారని, వీరిలో 70 వేల మందికి మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసినట్టు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉచిత గ్యాస్ సిలెండర్లు పొందే విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా 1967 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.