News August 5, 2024
రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. కాసేపటికి క్రితం అమెరికా చేరుకున్న నాయకులకు, ఎంబసీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తొలి ప్రాధాన్యతగా, రాష్ట్రంలో అధికంగా పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
Similar News
News September 14, 2024
డీజేల వినియోగం, బాణసంచా వాడకంపై నిషేధం: KNR సీపీ
కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి కీలక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న జరగనున్న గణేశ్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా జరిగే శోభయాత్ర రూట్లు, నిమజ్జన కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు పరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా గణేశ్ శోభాయాత్రలో డీజేల వినియోగంతో పాటు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు.
News September 14, 2024
గోదావరి నది బ్రిడ్జిపై నిమజ్జనానికి ఏర్పాట్లు
గోదావరిఖని శివారు గోదావరి నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో MLA రాజ్ ఠాకూర్ చొరవతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 16న ఉదయం నుంచి సాయంత్రంలోగా నిమజ్జనం పూర్తి చేయాలని గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచన మేరకు బ్రిడ్జిపై నుంచి గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంటున్నారు.
News September 14, 2024
సిరిసిల్ల: విష జ్వరంతో బాలిక మృతి
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక విష జ్వరంతో మృతి చెందింది. కుటుంబీకుల ప్రకారం.. మైదం శెట్టి మల్లికార్జున్ పెద్ద కూతురు నక్షత్ర హాసిని(13)కి బుధవారం జ్వరం వచ్చింది. స్థానిక ఓ ఆర్‌ఎంపీ దగ్గర వైద్యం చేయించగా నయం కాలేదు. ఆ తర్వాత సిరిసిల్ల, KNR నుంచి HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందింది.