News July 18, 2024

రాష్ట్ర వైశ్య సంఘంలో జిల్లా వాసులకు చోటు ఇవ్వాలి: రాజేశ్

image

పార్వతిపురం జిల్లా వైశ్య సభ్యులకు రాష్ట్ర స్థాయి వైశ్య సంఘంలో చోటు కల్పించాలని టీడీపీ బీసీ సాధికారిక జిల్లా కో-ఆర్డినేటర్ కోరాడ రాజేశ్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వైశ్యులకు చేరాలన్నా, జిల్లా వైశ్య కుటుంబాలు సమస్యలు చెప్పాలన్నా రాష్ట్ర కమిటీలో జిల్లా వైశ్య సభ్యులకు చోటు కల్పించాలన్నారు. వైశ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు.

Similar News

News January 6, 2026

రోడ్డు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి

image

విజయనగరం జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన జీ.నగేశ్ (30) అనే యువకుడు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి లగేజీ వ్యాన్‌పై టెక్కలి వైపు సామాగ్రి తీసుకువస్తుండగా రోడ్డుపక్కన బండి ఆపి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News January 6, 2026

SKLM: సముద్రంలో బోటు బోల్తా.. మత్స్యకారుడి మృతి

image

వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడా గ్రామానికి చెందిన చెక్క గోపాలరావు (42) మంగళవారం సముద్రంలోకి వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఎప్పటిలాగే తోటి మత్స్యకారులతో ఫైబర్ బోటుపై వేటకు వెళ్లారు. అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

News January 6, 2026

SKLM: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు..మూడు రోజులే ఛాన్స్

image

శ్రీకాకుళం జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ‌గా పోస్టులకు విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. లావేరు, పొందూరు, పోలాకి, జలుమూరు, పాతపట్నం, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురంలో మండలాల్లో మొత్తం 15 ఖాళీలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. JAN6- 8తేదీల లోపు ఆయా స్కూల్స్‌కు దరఖాస్తులను అందజేయాలని DEO రవిబాబు పేర్కొన్నారు. రూ.12 వేలు వేతనం ఇవ్వనున్నారు.