News September 27, 2024
రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు.. నోటీసులు ధర్మమా?: అంబటి
మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం ధర్మమా అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి తిరుమల బయల్దేరనున్న జగన్.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Similar News
News October 10, 2024
T20 క్రికెట్ టోర్నమెంట్‌లో మంగళగిరి అమ్మాయి
ఈ నెల 17 నుంచి బరోడా వేదికగా జరిగే ఇండియా సీనియర్ మహిళా T20 టోర్నమెంట్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ మహిళ క్రికెట్ టీంలో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గత నెల సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఢిల్లీలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ఐపీఎల్ టీం సెలక్షన్ ట్రైల్‌కి హాజరయ్యారు. మంగళగిరి నుంచి ఎంపికైన మొదటి మహిళా క్రికెట్ క్రీడాకారిణి పావనికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News October 9, 2024
గుంటూరులో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌డెడ్
నల్లపాడు – అంకిరెడ్డిపాలెం రహదారిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు మార్జిన్‌లో ఆపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని కింద పడ్డాడు. ఈ క్రమంలో కారు ఆ వ్యక్తి తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. మృతుడు గుర్రాల మరియదాసు (60)గా గుర్తించారు.
News October 9, 2024
రాష్ట్రస్థాయి జట్టుకు శావల్యాపురం విద్యార్థిని ఎంపిక
శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.కావ్య బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల పీడీ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్‌లో నాగపూర్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో కావ్య పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి విద్యార్థినిని అభినందించారు.