News February 18, 2025

రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ జాతర వాల్ పోస్టర్ల ప్రదర్శన

image

వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల వద్ద వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ సిబ్బంది అతికిస్తున్నారు. ఈనెల 25 నుంచి 27 గురువారం వరకు మూడు రోజులపాటు వేములవాడలో మహా శివరాత్రి జాతర జరుగుతుందన్నారు. పూజల వివరాలు, సమయాలతో కూడిన పూర్తి వివరాలతో వాల్ పోస్టర్లను రూపొందించామని తెలిపారు. 

Similar News

News April 18, 2026

‘అరైవ్ అలైవ్’ ప్రచారం కాదు.. ప్రాణాల రక్షణకు వాగ్దానం: సీపీ

image

‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం ప్రచారం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే బాధ్యత అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. గజ్వేల్‌లో ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడంతో ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తప్పుతుందన్నారు.

డీఎస్‌బీసీ‌యూ కమిటీ ఛైర్మన్‌గా మణికంఠ

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకదారుల యూనియన్ డీఎస్‌బీసీ‌యూ త్రీ‌మెన్ కమిటీ ఛైర్మన్‌గా కారంచేడు మండలానికి చెందిన కడియం మణికంఠ శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. త్రీ మెన్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కడియం మణికంఠకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. గొర్రెల పెంపకదారుల అభ్యున్నతి కృషి చేయాలని ఆకాంక్షించారు.