News December 28, 2024

రాష్ట్ర స్థాయికి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు

image

హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ హాకీ టోర్నమెంట్లో రెండో రోజు మహబూబ్‌నగర్ జిల్లా హాకీ జట్టు సెమీఫైనల్‌కి చేరింది. రెండవ రోజు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా జట్లతో క్రీడాకారులు అత్యున్నత మైన ప్రదర్శన కనబరిచి విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కి అర్హత సాధించారు. రేపు నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల జట్లు సెమీఫైనల్‌లో పోటీ పడతాయని నిర్వాహకులు తెలిపారు. 

Similar News

News November 18, 2025

జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

image

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2025

MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

image

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

image

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.