News April 12, 2025

రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట విద్యార్థిని సత్తా.. సన్మానం

image

మాచిరాజు బాల సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 2025 బాలల కథల పోటీల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థిని స్తతా చాటింది. ఈ పోటీల్లో బక్రీ చెప్యాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జక్కుల లోహితకు మొదటి బహుమతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం బక్రీ చెప్యాల పాఠశాలలో లోహితను ఉపాధ్యాయులు సన్మానించారు. 541 కథలను వెనక్కు నెట్టి లోహిత కథ మొదటి స్థానం సాధించడం ఆనందంగా ఉందన్నారు.

Similar News

News February 25, 2026

లొంగు‘బాట’లో గణపతి!

image

TG: మావోయిస్టు అగ్రనేత గణపతి(ముప్పాళ్ల లక్ష్మణరావు) కూడా లొంగు‘బాట’లో ఉన్నట్లు సమాచారం. నేపాల్‌లో తలదాచుకుంటున్న ఆయన TG పోలీసుల ముందు లొంగిపోయేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాలకు అప్పగించొద్దని ఆయన షరతు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో నేపాల్‌లో చికిత్సపొందుతున్న గణపతి ఆరోగ్యంపై క్లారిటీ రాగానే లొంగుబాటును ప్రకటించే అవకాశముందంటున్నాయి.

News February 25, 2026

నెల్లూరు: రెండో రోజు 899 మంది ఆబ్సెంట్.!

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ మాల్ ప్రాక్టీసింగ్‌కు తావు లేకుండా పరీక్ష జరిగినట్లు ఆర్ఐవో వరప్రసాద్ రావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 27,790 మంది విద్యార్థులకు గాను 26,891 మంది హాజరయ్యారని 899 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

News February 25, 2026

చారిత్రక వారసత్వం.. శ్రీరంగపురం ఆలయ విశిష్టత

image

వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీరంగం తమిళనాడు వెళ్లలేని భక్తుల కోసం వనపర్తి రాజులు ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు శేషతల్పంపై పవళించిన భంగిమలో దర్శనమిస్తారు. విజయనగర శిల్పకళా రీతిలో నిర్మించిన ఈ ఆలయం, సంస్థానాధీశుల భక్తికి నిదర్శనం. # నేటి నుంచి బ్రహ్మోత్సవాలు