News January 30, 2025

రాష్ట్ర స్థాయిలో హనుమకొండ బిడ్డ సత్తా చాటాడు

image

ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో హనుమకొండ నగరానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కొప్పుల చరణ్ వరంగల్ జిల్లా తరఫున పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. ఈ పోటీల్లో వరంగల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ఇన్‌ఛార్జ్ కె.విద్యాకర్ అభినందించి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. 

Similar News

News December 6, 2025

కరీంనగర్‌: అంబేడ్కర్‌కు బండి సంజయ్ నివాళి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News December 6, 2025

రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

image

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్‌లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్‌లో అన్నారు.

News December 6, 2025

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు(1/2)

image

వైరస్ ఆశించిన కూరగాయల మొక్కల్లో లేత ఆకులు చిన్నగా, పసుపు రంగుకు మారి పాలిపోయినట్లు కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై అక్కడక్కడ పసుపురంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులపై పసుపు చారలు ఏర్పడి, గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్యభాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకుల ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారతాయి. మొక్క చివరి ఆకులు ఎండి, చనిపోయినట్లుగా ఉంటాయి.