News October 29, 2024
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కందూరు విద్యార్థిని ప్రతిభ
సోమల మండలం కందూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని కే.మౌనిక జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైంది. ఈ నెల 25, 26, 27 తేదీలలో కర్నూలులో జరిగిన SGFI, రాష్ట్ర స్థాయి U-19 అథ్లెటిక్స్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని హెచ్ఎం వెంకటరమణరెడ్డి తెలిపాడు. నవంబర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పీడీ చిన్నప్ప, MEO, హెచ్ఎం వెంకటరమణ రెడ్డి, టీచర్లు అభినందించారు.
Similar News
News November 10, 2024
చిత్తూరు: చిరుత దాడిలో మరో పాడి ఆవు మృతి.?
చిరుత దాడిలో మరో ఆవు మృతి చెందినట్లు చౌడేపల్లి మండలంలోని రైతులు చెబుతున్నాడు. బాధిత రైతు కథనం మేరకు.. నాగిరెడ్డిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డికి ఆవులు ఉన్నాయి. వాటిని సమీపంలోని కందూరు అడవిలోకి మేత కోసం తరలించారు. సాయంత్రం పశువులన్నీ ఇంటికి చేరుకోగా ఒక ఆవు కనిపించలేదు. రైతు గాలింపు చేపట్టగా శనివారం చనిపోయి కనిపించింది. దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సి ఉంది.
News November 10, 2024
చంద్రగిరి: కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధికి అడుగులు: మంత్రి
కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. శనివారం హౌసింగ్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీ మోహన్ లతో కలసి మంత్రి పాల్గొన్నారు. హౌసింగ్ కాలనీలో ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు.
News November 9, 2024
చిత్తూరు: హేమలత నేపథ్యం ఇదే..
నామినేటెడ్ పోస్టుల్లో చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా K.హేమలతను నియమించారు. గతంలో (2017) ఆమె చిత్తూరు మేయర్‌గా పనిచేశారు. మేయర్‌గా ఉంటూ హత్యకు గురైన కటారి అనురాధకు ఆమె మేనకోడలు. దీంతో ఆమెను అప్పట్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ అభివృద్ధికి కృషి చేశారు. పోలీసులు వేధిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు.