News March 28, 2025

రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు వికారాబాద్ వాసి

image

సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు గోపి ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నేనావత్ పరశురాం నాయక్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 27, 30 తేదీలలో బిహార్ రాష్ట్రంలో నిర్వహించనున్న 34వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు గోపి ఎంపిక కావడంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.

Similar News

News November 28, 2025

గిరిరాజ్ కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి

image

జి.జి.కళాశాలలో జ్యోతిరావు ఫూలే వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. కులవివక్షతను ఎదిరిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, స్త్రీవిద్య కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఫూలే స్ఫూర్తిని కొనసాగించడమే నిజమైన నివాళి అని వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం పేర్కొన్నారు. దండుస్వామి, రామస్వామి, రంజిత, నహీదా బేగం, వినయ్ కుమార్, పూర్ణచందర్ రావు, రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 28, 2025

మోడల్ ఫామ్ డెమో హౌస్‌ను సందర్శించిన కలెక్టర్

image

బూర్గంపాడు మండలంలోని ఎంపీ బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన మోడల్ ఫామ్ డెమో హౌస్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. వ్యవసాయ ఆధారిత బహుముఖ ఆదాయ వనరులను గ్రామస్థులకు చేరువ చేయడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధి, సేంద్రియ వ్యవసాయంపై రూపొందించిన ఈ మోడల్ ఫామ్ జిల్లా స్థాయిలో ఆదర్శ ప్రదర్శనగా నిలుస్తుందని కలెక్టర్ కొనియాడారు.

News November 28, 2025

శ్రీశైలంలో డిసెంబర్-1 నుంచి ఉచిత లడ్డూ కౌంటర్.!

image

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ ఛైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి రూ.500, రూ.300 టికెట్ పొందిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాద కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. అలాగే నూతన డొనేషన్ కౌంటర్, కైలాస కంకణముల కౌంటర్, ధర్మకర్తల మండలి చాంబర్ ప్రారంభించటంతోపాటు శ్రీ గోకులం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.