News February 3, 2025

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం జట్టు సిద్ధం

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా టీం ఎంపికైందని కోచ్ వీరరాఘవయ్య తెలిపారు. కల్లూరు మినీ స్టేడియంలో జరిగిన శిబిరంలో టీం ఎంపికైందని చెప్పారు. శిబిరంలో ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కార్యదర్శి కటికల క్రిస్టోఫర్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.. వీరు ఆదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

Similar News

News February 3, 2025

అందరి చూపు త్రిషపైనే..!

image

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీశారు. ఇటీవల ఆసియా కప్ గెలవడంలోనూ ఈమె కీలక పాత్ర పోషించారు. దీంతో అందరి చూపు ఈ భద్రాచలం అమ్మాయిపైనే ఉంది. ఇలానే ఆడితే సినియర్ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News February 3, 2025

బాలిక ఇంటి ఎదుట యువకుడి హల్చల్ 

image

పెనుబల్లి మండల కేంద్రంలో మహేందర్ సాయి అనే యువకుడు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించాడు. స్థానికుల వివరాలు… తనను ప్రేమించాలంటూ ఓ మైనర్ బాలిక ఇంటి ఎదుట హల్చల్ చేశాడు. కాసేపటి తరువాత స్థానికులను దూషించగా వారు దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కొంతకాలంగా మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

News February 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు
∆} నేలకొండపల్లిలో భక్త రామదాసు జయంతి వేడుకలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన