News September 12, 2024
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు పిట్లం విద్యార్ధిని ఎంపిక

రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు పిట్లం ZPHS విద్యార్ధిని మహాలక్ష్మి ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సంజీవులు తెలిపారు. పాల్వంచలో ఈ నెల 9 న జరిగిన జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్లో మహాలక్ష్మి ప్రతిభ కనబరిచింది. ఖమ్మంలో జిల్లా కల్లూరు మిని స్టేడియంలో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగే ఖో ఖో సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు అభినందించారు.
Similar News
News February 23, 2026
NZB: రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో హరీశ్ తేజకు సిల్వర్ మెడల్

తెలంగాణ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హరీశ్ తేజ సిల్వర్ మెడల్ సాధించాడు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 65 కేజీల కేటగిరిలో హరీశ్ తేజ కోచ్ రాజ్ కుమార్ సహకారంతో స్నాచ్‌లో 96, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీల బరువెత్తి మొత్తం 207 కేజీల బరువుతో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
News February 23, 2026
NZB: మార్కెట్ కమిటీల సమస్యలు పరిష్కరించాలని వినతి

తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మన్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డికి మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు అందకపోవడం, యార్డుల అభివృద్ధి పనులు మంజూరులో జాప్యం, ఛైర్మన్ గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
News February 23, 2026
నిజామాబాద్: పసుపు రైతులకు ముఖ్య గమనిక

అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. మంగళవారం పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగొళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.


