News January 30, 2025
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా బిడ్డ

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లి జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి సాఫ్ట్ బాల్ క్రీడలో రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కుసుమ రమేశ్, పీటీ కొండ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గుగులోతు మధుసూదన్ అనే విద్యార్థి గత నవంబరులో వరంగల్‌లో జరిగిన జిల్లా స్థాయి 68వ స్కూల్ గేమ్స్‌లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వారు తెలిపారు.
Similar News
News March 13, 2025
సిద్దిపేట: 14 నుంచి 29 వరకు అన్ని బంద్: సీపీ

అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 నుంచి 29 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధించినట్లు తెలిపారు. డీజేలు సైతం నిషేధించినట్లు సీపీ తెలిపారు.
News March 13, 2025
ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.