News July 29, 2024

రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రొద్దుటూరు విద్యార్థులు

image

నంద్యాలలో నేడు జరిగిన జిల్లా స్థాయి జంప్ రోప్ పోటీలలో ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పసిడి, రజతం, కాంస్య పథకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ షేక్ ఇలియాస్ తెలిపారు. ఆగస్టు నెలలో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగే రాష్ట్రస్థాయి జంప్ రోప్ పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు. అనంతరం పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

Similar News

News December 25, 2025

మైదుకూరులో గుండెపోటుతో యువ వైద్యుడు మృతి

image

మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డుకు చెందిన యువ వైద్యుడు శశికాంత్ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన మృతి చెందడం పట్ల మైదుకూరు పట్టణ వాసులు, పరిసర ప్రజలు విచారం వ్యక్తం చేశారు. కాగా ఈయన తండ్రి డాక్టర్ రంగ సింహ ఇటీవలే వయో భారం కారణంగా మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు వైద్యులు మృతి చెందడంతో పట్టణవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈయన ఉన్నత వైద్య విద్యను అభ్యసించారు.

News December 25, 2025

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 25, 2025

జగన్‌కు ముద్దు పెట్టిన విజయమ్మ

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.