News February 18, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో జగిత్యాల బిడ్డల ప్రతిభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు పట్టణానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, కరాటే మాస్టర్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో వెళ్లిన ఆరుగురు విద్యార్థులు 12 బంగారు పతకాలతో మెరిశారు. పట్టణంలోని వీర కుంగ్ ఫూ అకాడమీలో శిక్షణ పొందిన ఆరుగురు విద్యార్థులు మానూప్, కనిక్, మన్విత, మణిదీప్, అన్వితలు పాల్గొని 12 బంగారు పతకాలు సాధించారు.
Similar News
News November 19, 2025
నరసరావుపేట: కొండెక్కిన కోడిగుడ్డు ధరలు

కోడి గుడ్డు ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఒకొక్క కోడిగుడ్డు రూ. 8 ధర పలుకుతోంది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేక్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. గత నెలలో ఒక్క కోడిగుడ్ల ధర రూ .7 వరకు ఉండేది. ఈ నెలలో రూ. 8 లు, డజను కోడిగుడ్లు రూ. 98 వరకు పలుకుతుంది. ఇటీవల కురిసిన వర్షాలు, డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడమే ధర పెరగడానికి కారణమని వ్యాపారులు తెలిపారు.
News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.


