News November 26, 2024

రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీల్లో జిల్లాకు రెండవ స్థానం

image

రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీల్లో అనంతపురం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. విజయవాడలోని జడ్పీహెచ్ఎస్ పటమటలో సోమవారం నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో అనంతపురం జిల్లా అండర్‌14 బాలుర జట్టు రెండవ స్థానంలో నిలిచినట్లు కోచ్ మారుతి ప్రసాద్, మంజునాథ్ తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరచిన జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు.

Similar News

News December 14, 2024

పట్టుదల ఉంటే ఉద్యోగం మీ సొంతం: మంత్రి పయ్యావుల

image

గ్రామీణ నిరుద్యోగ యువత, విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటే సులభతరంగా ఉద్యోగాలు పొందవచ్చని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా కృషి, పట్టుదలను అలవర్చుకోని ఉద్యోగ అన్వేషణలో ముందడుగు వేయాలని తెలిపారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని సంబంధం లేకుండా అనుభవాన్ని పెంచుకోవడానికి వచ్చిన ప్రతి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 14, 2024

అనంతపురంలో కేజీ టమాటా రూ.10

image

టమాటా ధరలు పడిపోయాయి. ఆయా రాష్ట్రాలో దిగుబడి పెరగడంతో అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో రూ.10కి చేరింది. కనిష్ఠంగా రూ.4, సరాసరి రూ.6తో విక్రయాలు సాగుతున్నాయి. మరోవైపు చీనీ ధరలు కూడా పడిపోయాయి. మొన్నటి వరకు టన్ను రూ.30వేలకు పైగా పలకగా తాజాగా గరిష్ఠంగా రూ.29 వేలతో అమ్ముడవుతోంది.

News December 14, 2024

అనంత: స్నేహితుని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

image

స్నేహితుని హత్యకేసులో ఇద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ అనంతపురం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2019లో పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ మణికంఠను తన స్నేహితులు మద్యం మత్తులో దాడి చేసి హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.