News November 29, 2024
రాష్ర్టంలో చిత్తూరు జిల్లా నంబర్ 1

గిరిజనుల ఆధార్ నమోదులో రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. ఆధార్ కార్డు లేని 931 మందిని గుర్తించి 424 మందికి ఆధార్ కార్డు మంజూరు చేశామన్నారు. మిగిలిన 50 శాతం మందికి త్వరలో మంజూరు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆధార్ నమోదులో ముందంజలో ఉన్నామన్నారు. ఎవరైనా గిరిజనులు ఆధార్ లేకుంటే సచివాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News November 18, 2025
చిత్తూరు జిల్లాలో 27మందిపై క్రమశిక్షణ చర్యలు

చిత్తూరు జిల్లా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాక్ ఇచ్చారు. ‘జిల్లాలో 612సచివాలయాల్లో 4,477మంది పనిచేయాల్సి ఉంది. 4,040మంది విధులు నిర్వహిస్తుండగా 437మంది డ్యూటీకి రావడం లేదు. ఇందులో 152మంది మెడికల్ లీవ్, 251 మంది డిప్యుటేషన్పై వేరేచోట పనిచేస్తున్నారు. అనధికారికంగా సెలవుపై ఉన్న 27మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మెడికల్ లీవు వాళ్లను మరోసారి చెక్ చేయాలి’ అని కలెక్టర్ ఆదేశించారు.

News November 17, 2025
చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.