News January 5, 2025
రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం: KTR
రాహుల్ గాంధీ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. వరంగల్ డిక్లరేషన్ సభలో ప్రచారం చేసింది రూ.15 వేలు.. అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు అని చెప్పారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్, అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్, మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అని ‘X’ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR తీవ్ర స్థాయిలో ధజమెత్తారు
Similar News
News January 22, 2025
మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ
మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పోకడలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో పాటు పిరమిడ్ లాంటి స్కీంల ద్వారా ప్రజల సొమ్ము దోచేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News January 21, 2025
నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటానికి జిల్లా కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద దేవి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఔత్సాహిక మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
News January 21, 2025
పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ఏసీపీ దేవేందర్ రెడ్డి
పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ డివిజన్ పోలీస్ అధికారులతో ఏసీపీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చోరీలను కట్టడి చేయడం కోసం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు.