News November 30, 2025

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం HILTP పేరుతో రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతోందని రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. రాహుల్ స్పందించకుంటే అందులో భాగస్వామ్యం ఉన్నట్లేనని పేర్కొన్నారు. ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని ఆరోపించారు. ఈ విధానంతో సీఎం సన్నిహితులు, కాంగ్రెస్ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లాభం పొందుతారని వివరించారు.

Similar News

News April 14, 2026

అమరావతిలో మరో 3,072 ఎకరాల భూసమీకరణ

image

AP: రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తుళ్లూరు(M) పెదపరిమి పరిధిలో ప్రభుత్వ భూమిని మినహాయించి 3,072 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు CRDA నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై నెల రోజుల్లో రైతులు అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ భూమిని వినియోగించనున్నారు.

News April 14, 2026

1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

image

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20. మరిన్ని వివరాలకు punjabandsind.bank.in చూడండి.

News April 14, 2026

BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు ఏప్రిల్ 16-23 వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.