News December 26, 2024
రాహుల్ గాంధీకి ధన్యవాదాలు: మంత్రి పొన్నం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం (ఎక్స్) ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రగతిని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. మీ మార్గదర్శకత్వం మాకు స్ఫూర్తినిస్తుంది అని ట్వీట్ చేశారు.
Similar News
News December 27, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్
☞కాటారం మండలంలో వ్యక్తి దారుణ హత్య ☞రామడుగు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ☞మంథని: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదు మూగజీవాలు మృతి ☞ఎల్కతుర్తి: ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి ☞కమలాపూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు ☞వేములవాడ: రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి ☞కమాన్ పూర్: ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు ☞ఓదెల: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి పొన్నం
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికవేత్త, నిరాడంబరి, దేశం ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కొల్పోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News December 27, 2024
వేములవాడ: గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
రాజన్న గోవులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని గోశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. గోశాలలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోవుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.