News October 2, 2024

రాహుల్ గాంధీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

image

హైడ్రా విషయంలో రాహుల్ గాంధీపై సిరిసిల్ల MLA కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్ట్‌ను రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతి ఇచ్చాడని బుధవారం విలేకరుల చిట్ చాట్‌లో ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ హైడ్రాను నడిపిస్తున్నాడన్నారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తుండని స్పష్టం చేశారు.

Similar News

News October 11, 2024

KNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి

image

KNR, JTYL, PDPL,SRCL జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

News October 11, 2024

గోదావరిఖని: ప్రేమ పెళ్లి.. యువకుడి హత్యకు దారి తీసింది! 

image

ప్రేమ పెళ్లి <<14324262>>యువకుడి హత్య<<>>కు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యైంటిక్లయిన్‌ కాలనీలోని హనుమాన్‌నగర్‌ చెందిన అంజలికి భర్త, పిల్లలు ఉండగానే వినయ్‌ని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయంలో కక్ష పెంచుకున్న మొదటి భర్తతో పాటు అంజలికి వరుసకు సోదరుడు పథకం ప్రకారం వినయ్‌ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ACP రమేశ్, CI ప్రసాద్ రావు కేసు నమోదు చేశారు.  

News October 11, 2024

కరీంనగర్: నేడు కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ

image

రాష్ట్ర వ్యాప్తంగా అంతట ఏడు, తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మాత్రం పదో రోజు జరుపుకొంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో శుక్రవారం కొత్తపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, అధికారులు చెరువు కట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేశారు.