News June 19, 2024

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

image

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు హనుమంతరావు, సంపత్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే తరానికి మార్గదర్శి రాహుల్ గాంధీ అని కొనియాడారు.

Similar News

News September 12, 2024

మేకిన్ తెలంగాణా భావనను పెంపొందించాలి: మంత్రి శ్రీధర్ బాబు

image

రాష్ట్రాన్ని ఉత్పాదక రంగంలో అగ్రగామిగా నిలిపేలా ‘మేక్ ఇన్ తెలంగాణా’ భావనను పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు. హైదరబాద్‌‌లోని బేగంపేటలో బుధవారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా చాప్టర్ 38వ వార్షిక సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్మన్ బాలకృష్ణరావు, హన్మంతరావు తదితరులు ప్రసంగించారు.

News September 11, 2024

ఈనెల 17న జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్న మంత్రి, విప్

image

సెప్టెంబర్ 17న రాష్ట్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్‌లు జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ జారీచేశారు.

News September 11, 2024

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన రామగుండం MLA

image

హైదరాబాద్ సెక్రటేరియట్లో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గం అభివృద్ధి గురించి కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, కటుకు ధనుంజయ్, అరగంట కృష్ణ, జనగాం శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.