News April 10, 2025

రికార్డుల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

image

తహశీల్దార్ కార్యాలయంలో విద్యుత్తు మరమ్మత్తులతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఫైల్స్ రికార్డు గదిని కలెక్టర్ పరిశీలించారు. పహానీల స్కానింగ్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News December 22, 2025

HYD: జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్..!

image

HYDలో సంక్రాంతి సందర్భంగా వచ్చే నెల జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్లో జరగనుంది. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లను సీఎస్ రామకృష్ణారావు సోమవారం సమీక్షించారు.వివిధ దేశాల నుంచి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఈ ప్రోగ్రాంతో రంగురంగుల గాలిపటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో HYD నగరం పండుగ ఉత్సాహంతో కళకళలాడనుంది.

News December 22, 2025

జనగామ: ఒకే బడి.. ఒకే తరగతి.. ముగ్గురు విజేతలు!

image

జిల్లాలోని రఘునాథపల్లిలో ముగ్గురు బాల్య స్నేహితుల విజయం ఆకర్షణగా నిలిచింది. ఒకే బడి, ఒకే తరగతిలో చదువుకున్న కడారి మహేందర్, బాలగోని శ్రీనివాస్, సమ్మయ్య వేర్వేరు వార్డుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము, ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని వారు చెబుతున్నారు. తమపై నమ్మకముంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు.

News December 22, 2025

HYD: పరీక్ష పే చర్చ రిజిస్ట్రేషన్ షురూ..!

image

HYD వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొనాలని పలు పాఠశాలల అధ్యాపకులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా పరీక్షల భయం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. పరీక్షల సిద్ధత, సమయ నిర్వహణ, ఒత్తిడి నియంత్రణ కోసం lnkd.in/gmVK9VD4 లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని, పాల్గొనండి.