News April 10, 2025

రికార్డుల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

image

తహశీల్దార్ కార్యాలయంలో విద్యుత్తు మరమ్మత్తులతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఫైల్స్ రికార్డు గదిని కలెక్టర్ పరిశీలించారు. పహానీల స్కానింగ్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News April 17, 2026

HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

image

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్‌కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TU: పార్లమెంట్‌‌లో ప్రసంగించిన ‘కీర్తన’ను అభినందించిన ఉపకులపతి

image

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం నుంచి ఎంపికైన TU విద్యార్థిని కీర్తన ఈనెల 14న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించారు. VC యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి ఆమెను అభినందించారు. యూనివర్సిటీ తరఫున రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. VC మాట్లాడుతూ.. కీర్తన ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఆకాంక్షించారు.