News June 9, 2024

రికార్డు బ్రేక్ చేసిన దామచర్ల జనార్దన్

image

ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 19 సార్లు(ఉప ఎన్నికలతో కలిపి) ఎన్నికలు జరిగాయి. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్లపై 32,994 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఎన్నికల్లో అదే అత్యధిక రికార్డు. కానీ 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ బాలినేనిపై 34,026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాగా 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్లదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.

Similar News

News September 30, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య?

image

పామూరులోని 565 జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందారు. రోడ్డు పక్కన పడి ఉన్న మృతదేహం కాళ్లు, చేతులు, మెడను తాళ్లతో కట్టి ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పట్టణంలోని కరెంటు కాలనీకి చెందిన సిద్ధవటం వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యా మరేదైనా కారణమా అన్న కోణంలో విచారిస్తున్నారు.

News September 30, 2024

గిద్దలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

గిద్దలూరు మండలంలో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని సర్విరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతున్న 6 సంవత్సరాల బాలుడిని, వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందాడు.

News September 30, 2024

పింఛన్లపై ప్రకాశం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా అక్టోబర్ 2024కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ 100 శాతం పంపిణీ చేయాలన్నారు.